{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581231968093","total_editor_time":2,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581231919040","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ యంత్రంపై సిరిసిల్ల నేతన్నలు అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. ఉపాధికి భరోసానిస్తూ అండగా ఉంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రాలతో ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ యంత్రాలపై పట్టుచీరెలను తీర్చిదిద్ది అబ్బురపరుస్తున్నారు నేతకార్మికులు కుసుమ నర్సింహస్వామి, హరిప్రసాద్‌. సిరిసిల్లలోని జ్యోతినగర్‌కు చెందిన నర్సింహస్వామి రాష్ట్రంలోనే తొలిసారిగా తన కార్ఖానాలో ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ మరమగ్గాన్ని ఏర్పాటుచేసుకుని, పట్టుచీరెల తయారీకి శ్రీకారం చుట్టారు.

Advertisement

ఆ ఆధునిక మరమగ్గాల పనితీరుకు ముగ్దుడయిన మంత్రి కేటీఆర్‌, వాటిని సిరిసిల్ల కార్మికక్షేత్రంలో ప్రవేశపెట్టాలని భావించారు. అందులోభాగంగా ఈ యంత్రాల ప్రయోజనాలు, పనితీరుపై అవగాహన సమావేశాలు ఏర్పాటుచేశారు. యం త్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహికులకు పీఎంఈజీపీ ద్వారా 25 శాతం సబ్సిడీపై రుణసౌకర్యం కూడా కల్పించారు. చంద్రంపేటలో ఎలక్ట్రానిక్‌ జకార్డును ఏర్పాటుచేసుకున్న వెల్డి హరిప్రసాద్‌ తొలుత పట్టుచీరెపై వినాయక ప్రతిమ తీర్చిదిద్ది అబ్బురపరిచాడు. ఆయన తాజాగా మంత్రి తారకరామారావు చిత్రాన్ని తీర్చిదిద్దాడు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై అభిమానంతో నేతకార్మికుడు కుసుమ నర్సింహస్వామి పట్టుచీరెలపై వారి చిత్రాలను తీర్చిదిద్దాడు. ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ ప్రతినిధి వెంకట్రావు సౌజన్యంతో వారంపాటు శ్రమించి డిజైన్‌ చేశారు. తెలంగాణను సాధించడమే గాక అభివృద్ధి పథంలో నిలుపుతున్న కేసీఆర్‌, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అండగా నిలుస్తున్న మంత్రి కేటీఆర్‌ అంటే తనకెంతో అభిమానమని ఆయన చెప్తున్నాడు. కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రాలతోపాటు ప్రతిష్ఠాత్మక పథకాలైన మిషన్‌ భగరీథ, కాళేశ్వరం ప్రాజెక్టు నమునాలను సైతం పట్టుచీరెలపై నేస్తున్నామని నర్సింహస్వామి, హరిప్రసాద్‌ వివరించారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు వాటిని కానుకగా అందిస్తామని వెల్లడించారు.