పట్టు వీడని ప్రేమ – 41 రోజులు ఇంటి ముందు కూర్చొని సాధించుకుంది

Advertisement

ఏళ్ల తరబడి ప్రేమించుకుని తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ప్రియుడు ముఖం చాటేయడంతో ప్రియురాలు అతని ఇంటి ఎదుట 41 రోజులు దీక్ష చేసి అనుకున్నది సాధించుకుంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తికి చెందిన శ్రీపతి శ్వేత అదే మండలం సూరారానికి చెందిన సట్ల సుధీర్‌గౌడ్‌ కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు.

ఇరు కుటుంబాలు పెళ్లి కుదుర్చుకునే సమయంలో సుధీర్‌ ప్లేటుఫిరాయించాడు. దీంతో శ్వేత ప్రియుడి ఇంటివద్ద బైఠాయించింది. ఒక దశలో ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో మనసు మార్చుకున్న సుధీర్‌ పెళ్లికి అంగీకరించడంతో మంగళవారం కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మత్చ్యగిరీంద్ర స్వామి గుడిలో ఆమెను వివాహం చేసుకున్నారు.