పదవి పోయినప్పటి నుంచి క్షోభ-నుభవిస్తున్నా:
ఉపముఖ్యమంత్రి పదవి పోయినప్పటి నుంచి తాను క్షోభననుభవిస్తున్నానని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో పాల్గొన్న నాయకులు గురువారం జనగామ జిల్లా రఘునాథపల్లిలో రాజయ్యకు వ్యతిరేకంగా ఆవేదనసభ నిర్వహించారు. తెలుసుకున్న ఆయన సమావేశానికి రావడంతో గోబ్యాక్ అంటూ నాయకులు నినాదాలు చేశారు. రాజయ్య మాట్లాడుతూ..ఉద్యమంలో పాల్గొన్నవారికి న్యాయం చేయలేకపోయినందుకు తనను క్షమించాలని వేడుకున్నారు.
Advertisement
వీటిని మనసులో పెట్టుకోకుండా తన విజయానికి కృషి చేయాలని వేడుకున్నారు.