పదవి విరమణ కేవలం వృత్తికే కాని వ్యక్తిత్వానికి కాదు: SP. చందన దీప్తి IPS

ఈ రోజు తేదీ 31-07-2019 మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు నవాజ్ రెడ్డి ఎ.ఎస్.ఐ. చిల్పిచేడ్ పి.ఎస్. గారి పదవీ విరమణ వీడ్కోలు సమావేషం జరిగింది. శ్రీ నవాజ్ రెడ్డి ఎ.ఎస్.ఐ. గారు 29 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకొని ఈ రోజు పదవి విరమణ చేయడం జరిగినది, ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి. కుమారి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు నవాజ్ రెడ్డి ఎ.ఎస్.ఐ. గారిని పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేసినారు. ఈ సందర్భంగా ఎస్.పి. గారు మాట్లాడుతూ: తన 29 సంవత్సరాల విధి నిర్వహణలో తన అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు, జీవితం లో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయని వాటిలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ కుడా ఒక ఘట్టమని, ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా మరియు కర్తవ్య దీక్షతో పనిచేయాలని కాబట్టి పతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేయక తప్పదని చెప్పినారు. పోలీస్ ఉద్యోగం అనేక ఒత్తిడిలతో కూడుకున్నదని, విధి నిర్వహణలో రాత్రనక పగలనక, పండుగల సమయంలోకుడా కుటుంబ సభ్యులకు దూరంగా వుంటూ విధులు నిర్వహించడం జరుగుతుందని, పోలీస్ ఉద్యోగంలో పదవి విరమణ పొందిన తర్వాత శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షిoచినారు.

పోలీసు రిటైర్మెంట్ కేవలం తన వృత్తికే కాని తన వ్యక్తిత్వానికి కాదు అని, ఎలాంటి సహాయం గురించి అయిన తమను ఎల్లవేళలా సంప్రదించవచ్చని జిల్లా ఎస్.పి. గారు తెలిపారు. అదేవిదంగా ఉమ్మడి మెదక్ జిల్లా పోలీస్ విభాగంలో సుదీర్ఘంగా విధులు నిర్వహించి ఉద్యోగ నిర్వహణలో తాను చేసిన సేవలను కొనియాడినారు. ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినాడని, తదుపరి పదవి విరమణ చేసిన నవాజ్ రెడ్డి ఎ.ఎస్.ఐ. గారికి జిల్లా ఎస్.పి. గారు రిటైర్మెంట్ కి సంబందించిన బెనిఫిట్స్ పత్రాలను అందచేశారు. పదవి విరమణ పొందిన పోలీస్ ఉద్యోగాస్తులతో ప్రస్తుత పోలీస్ సిబ్బందికి ఇచ్చే ప్రత్యెక శిక్షణా తరగతులకు హాజరుఅయి వారికి శిక్షణ ఇవ్వాలని కోరినారు. ఈ కార్యక్రమంలో మెదక్ డి.సి.ఆర్.బి. సి.ఐ. చందర్ రాథోడ్ ఎస్.బి. ఎస్.ఐ. రాంబాబు గారు, సి.సి. ప్రవీణ్ గారు మరియు పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here