ఈ రెండు ఫొటోలు చూసినపుడు మొదటి ఫొటోలో వున్న ఆమె దుర-దృష్టవంతురాలు అని, రెండో ఫోటో లో వున్న ఆమె అదృష్టవంతురాలు అని, లేదా మొదట ఆమె చదువుకోవాడానికి అవకాశాల్లేక, అలాగే ఒక కూలీ లాగా వుండిపోయిందని, రెండో ఫొటోలో ఆమెను ఆమె తల్లితండ్రులు బాగా ప్రోత్సహించారని, మంచి బడిలో చేర్పించారని, లేదా మొదటి ఆమె పేదరికానికి బలి అయితే, రెండో ఆమె సంపాదన బాగా వున్న కుటుంబంలో పుట్టిందని, అందుకే బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొందని, దేనికైనా రాసిపెట్టి వుండాలని, మన తల మీద శని నాన్ స్టాప్ నాట్యం చేస్తున్నాడని ఇలా రకరకాలుగా అనుకోవచ్చు. వాస్తవానికి ఈ రెండు ఫొటోల్లో వున్నది ఒకే ఆమె. మొదట్లో, ఉదయం నుండి మధ్యాహ్నం దాకా రాళ్ళు కొట్టి రోళ్ళు తయారు చేసి మధ్యాహ్నం దాటాక పసి బిడ్డను చంకనేసుకొని రోళ్ళను అమ్ముకొని అర కొర పైసలతోనే బతుకు బండిని లాగే ఈమె, ఆ పని చేస్తూనే రాత్రిళ్ళు చదువుకొని పరీక్షలకు కట్టి పాస్ అయ్యి ఇంకా ముందుకు చదివి ఇపుడు ఏకంగా police sub inspector ( SI ) అయ్యింది.
అంటే అది ఎంత గొప్ప విషయం కదా, జీవితంలో విజయం సాధించడం ఎలా.? అన్న ప్రశ్నకు “విజయానికి ఆరు మెట్లు” లాంటి పుస్తకాల్లో సమాధానం వుండదు. ఇలాంటి పుస్తకాలు వ్రాసిన రచయితలు, మరో రంగంలో కి అడుగుపెట్టి ఘోరంగా విఫలమయ్యారు. ఆయన వాళ్ళు వ్రాసిన పుస్తకాలు ఆయనకే వాళ్ళకే పనికిరాలేదు. అలాంటి వాళ్ళు కొందరు ఆ వ్యక్తిత్వ వికాస నిపుణులు ” అనే పేరుతో పట్టణాల్లో ఇంజినీరింగ్ కళాశాలలకు, కార్పొరేట్ కాళ్ళకు వస్తుంటారు. మా అనంతపురానికి కూడా వీళ్ళు తరచు వస్తుంటారు ఆయా కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు వీళ్ళకు డబ్బు కూడా ఎక్కువగానే చెల్లించుకోవాలని విన్నాను విజయానికి ఆరు, ఏడు, పది, పన్నెండు, ఇలా ఎన్ని బడితే అన్ని మెట్లు వుండవు, విజయానికి రెండే మెట్లు ఒకటి: నీ పట్ల నీ కున్న ఆత్మవిశ్వాసం, రెండు: పరమాత్మ పట్ల నీకున్న విశ్వాసం. ఇవి రెండూ వుంటే మిగతావి నిన్ను వెతుక్కొంటూ వస్తాయి.