పరకాలలో గలుపు పై కొండా సురేఖ

పరకాల నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న ఆధరాభిమానాలతో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తానని తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. గురువారం హన్మకొండలోని స్వగృహంలో పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు, గీసుగొండ, సంగెం మండలాల నుంచి వందలాది మంది యువకులు, రైతు సంఘం నాయకులు, పలు పార్టీల నుంచి భారీ సంఖ్యలో సురేఖ నివాసానికి వచ్చి కలిశారు. వారినుద్దేశించి సురేఖ మాట్లాడుతూ.. నియోజక వర్గం నుంచి పోటీ చేయడంతోపాటు ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పరకాల నియోజక వర్గంలోని ఆత్మకూరు, సంగెం, గీసుగొండ మండలాల నుంచి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.