పరకాల: అప్పుల భాద తాళలేక రైతు ఆత్మహత్య
పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన పెండ్యాల జగదీశ్వర్ (35) అనే రైతు అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ మధు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, జగదీశ్వర్ తనకున్న ఎకరం భూమితో పాటు మరో ఎకరం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పంటల పెట్టుబడి నిమిత్తం రూ.2లక్షలు అప్పు చేశాడు. ఆశించిన స్థాయిలో పంటల దిగుబడి రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆయన ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి కి తరలించారు.చికిత్స పొందుతూ జగదీశ్వర్ మృతి చెందాడు.
కాగా, తండ్రి సారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.