వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాలలోని కంఠాత్మకూర్ ఎస్‌బిఐ బ్రాంచ్‌లో కుంభకోణం శనివారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌బిఐలో ఎస్‌బిహెచ్ విలీనానికి ముందు రూ.2.15 కోట్లు దారి మళ్లించినట్లు ఎస్‌బిఐ ఉన్నతాధికారులు గుర్తించారు. అప్పటి బ్రాంచ్ మెనేజర్ నరేన్ చౌదరి ముద్రా-స్టాండప్ ఇండియా రుణాలను బోగస్ సంస్థల పేరిట మంజూరు చేశాడు.

ఈ స్కామ్‌లో మధ్యవర్తులు రాజేందర్, శ్రీనివాసుల ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు. ఈ స్కామ్ పై బ్యాంక్ ఉన్నతాధికారులు సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. సిబిఐ అధికారులు నరేన్ చౌదరి, రాజేందర్, శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేశారు.