వరంగల్ కు చెందిన రాచమళ్ళ అఖిల్ ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించాడు..

ఎన్నో ఆర్థిక అడ్డంకులు అధిగమించి ఎట్టకేలకు విజయవంతంగా కిలిమంజారో ఎక్కి బుధవారం సాయంత్రం కిందకు దిగాడు . దాదాపు 5895 మీటర్లతో ఆఫ్రికాలోనే ఎత్తయిన ఈ పర్వతాన్ని 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎక్కి విజయవంతంగా దిగాడు . పర్వతంపైన తన వెంట తీసుకెళ్లిన జాతీయ జెండాతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మతో ఉన్న ఫ్లెక్సీని ఎగరవేశాడు . బుధవారం రాత్రి టాంజానియా దేశంలోని కిలి మంజారో జాతీయ పార్కులో తెలుగు ప్రజలు ఈ యువకుడ్ని సత్కరించనున్నారు . నగరానికి చెందిన సామాజికవేత్త చిలువేరు శంకర్ చొరవతో అఖిల్ ఈ సాహసయాత్ర పూర్తి చేశాడు . మరో రెండు మూడు రోజుల్లో అఖిల్ హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవనున్నాడు .