తీన్మార్ సినిమాలో అన్నా లెజెనోవా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ కల్యాణ్ ఆమెతో ప్రేమలో పడ్డారు. 2011 సంవత్సరంలో తీన్మార్ సినిమా చిత్రీకరణ సమయంలో పవన్ కళ్యాణ్ ని మొదటిసారిగా కలిసింది అన్నా. అయితే ఆ సమయంలోనే పవన్, అన్నా లెజెనోవా మధ్య ప్రేమ పుట్టింది. వీళ్ళిద్దరూ కొన్నేళ్ల పాటు డేటింగ్ కూడా చేశారు. తరువాత పవన్ తన మాజీ భార్య రేణుదేశాయ్ కి విడాకులు ఇచ్చి 2013 సెప్టెంబర్ 30న ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అన్నా లెజెనోవా ని పెళ్లి చేసుకున్నారు. ఆ క్షణం నుంచి అన్నా లెజెనోవా రష్యా సంప్రదాయాన్ని పూర్తిగా వీడి భారతీయ మహిళ గా మారిపోయారు. వీరికి కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్, కూతురు పోలేనా అంజనా పవనోవాలు ఉన్నారు.
అన్నా లెజెనోవా మోడల్, నటి అయినప్పటికీ ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. ప్రస్తుతం ఎక్కువగా రష్యాలో ఉంటున్నట్టు తెలుస్తోంది. అన్నా లెజొనోవా తన పిల్లలు ఇద్దరినీ సింగపూర్ లో చదివించాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఎకనామిక్ టైమ్స్ ప్రకారం అన్నా లెజెనోవా ఆస్తుల విలువ రూ.1800 కోట్లుగా ఉంది అని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న వారు అవాక్కవుతున్నారు. అయితే ఆమెకు ఉన్న ఆస్తులు అన్నీ సింగపూర్, రష్యాలలోనే ఉన్నట్లు తెలుస్తోంది.