పాకిస్థాన్ చెందిన యుద్ధ విమానాలు భారత్ లోకి చొచ్చుకొని వచ్చాయని . . వాటిని వైమానిక దళాలు తిప్పికొట్టాయని త్రివిధ దళాల తెలిపాయి . గురువారం త్రివిధ దళాల ప్రతినిధులు న్యూఢిల్లీలో సంయుక్త | మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు | ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్ ఆర్మీ మేజర్ జనరల్ సురేంద్ర సింగ్ , నేవీ రేర్ అడ్మిరల్ డీఎస్ గుజ్రాల్ మీడియాతో మాట్లాడారు . తొలుత కపూర్ మాట్లాడుతూ “ ఫిబ్రవరి 27 ఉదయం 10గంటల సమయంలో పాక్ యుద్ధ విమానాలు భారత్ భూభాగంలోకి రావడాన్ని రాడార్లు గుర్తించాయి . వాటిని | మన వైమానిక దళాలు గుర్తించి తిప్పికొట్టాయి . పాక్ యుద్ధ విమానాలు మన – 2లో భూభాగంలో బాంబులు జారవిడిచాయి . అయితే వీటివల్ల ఎలాంటి నష్టం సంభవించలేదు .
ఖాళీ ప్రాంతాన్ని ఎంచుకొని దాడులు చేసినట్లు పాక్ అంతర్జాతీయంగా చెబుతోంది . పాక్ విమానాన్ని భారత వైమానిక దళం కూల్చేసింది . కానీ వాళ్లు మాత్రం తమ విమానమేమీ కూలిపోలేదని చెప్పుకుంటున్నారు . భారత భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని పాక్ దాడులకు దిగేందుకు ప్రయత్నించగా వాటిని సమర్థంగా ఎదుర్కొన్నాం అని తెలిపారు . ‘ రాజౌరి సెక్టార్లోకి ప్రవేశించిన ఒక పాకిస్తాన్ ఎఫ్ – 16 విమానాన్ని మన వైమానిక దళం కూల్చేసింది . భారత భూభాగంలో పడిన ఎఫ్ – 16 శకలాలు లభ్యమయ్యాయి . ఎఫ్ – యుద్ధవిమానం భారత్ లోకి వచ్చినట్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి . పాక్ యుద్ధ విమానాన్ని తిప్పికొట్టే క్రమంలో మనం ఐఏఎఫ్ మిగ్ 21 కోల్పోయాం . పైలట్ పాక్ భూభాగంలో దిగారు ఆయన్ను పాక్ అదుపులోకి తీసుకుంది . రేపు అతన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించడం చాలా సంతోషం అని ఎయిర్ వైస్ మార్షల్ కపూర్ తెలిపారు . ఈ విషయంలో పాక్ పదే పదే అసత్యాలు ప్రచారం చేసిందన్నారు తొలుత మూడు విమానాలు కూల్చివేసినట్లు పేర్కొన్న ఆ దేశ సైన్యం . . ఆ తర్వాత మాట మార్చి ఒక్క విమానాన్నే కూల్చామంటూ వాస్తవాన్ని ఒప్పుకున్నారని కపూర్ వివరించారు
అనంతరం ఆర్మీ మేజర్ జనరల్ సురేంద్ర సింగ్ మహల్ మాట్లాడుతూ పాక్ చర్యలను తిప్పికొట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు . ‘ ఉగ్రవాదంతోనే పోరాటం . ఫిబ్రవరి 14 నుంచి పాక్ కవ్వింపు చర్యలతో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉంది . వారికి మేం దీటుగా బదులిస్తున్నాం . పాక్లో ఉన్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసేందుకు మేం సిద్దంగా ఉన్నాం ‘ అని సురేంద్ర తెలిపారు పాక్ చర్యలకు దీటుగా బదులిచ్చేందుకు
తాము సిద్ధంగా ఉ న్నామని నావీ రేర్ అడ్మిరల్ డీఎస్ గుజ్రాల్ స్పష్టం చేశారు ప్రజల భద్రత తమకు అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు . బాలాకోట్ పై మెరుపుదాడులు చేయడం పైనా త్రివిధ దళాల ప్రతినిధులు స్పందించారు . బాలాకోటను ఎంచుకోవడానికి గల పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని . . వాటిని బయట పెట్టాలా వద్దా అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు .