తిరుమల కి వెళ్తున్నారా ఐతే మీ సద్ది కొంచెం ఎక్కువ తీసుకొని వెళ్ళండి

పాచిపోయిన పరోటా – నిన్నటి ఇడ్లీలు – తిరుమల స్పెషల్

రెండ్రోజుల క్రితం చేసిన పరోటా – తారు కంటే దారుణంగా కనిపించే వంటనూనె, రంగులు కలిపి నిగనిగలాడుతున్న గోబీ… అట్టలు కట్టుకుపోయిన ఇడ్లీ. ఇవీ తిరుమల హోటళ్లలోని ఆహార పదార్థాల దుస్థితి. శ్రీవారి దర్శనానికి ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చే లక్షలాది భక్తుల ఆకలిని ఆసరాగా చేసుకొని.

వ్యాపారులు నాణ్యతలేని ఆహారాన్ని వారికి అంటగడుతున్నారు. ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారు. తిరుమలలో విస్తృతంగా హోటళ్లపై దాడులు చేసి. అక్కడున్న ఆహార పదార్థాలను సీజ్‌ చేశారు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అన్నీ హోటళ్లను పరిశీలించారు. బస్టాండు ఎదురుగా, మాధవనిలయం, ప్రధాన సమాచార కేంద్రం, రైల్వే రిజర్వేషన్‌ ప్రాంతంలోని వివిధ హోటళ్లలో ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించి.

పాచిపట్టిన వాటిని చెత్తబుట్టల్లో పారేశారు. ఆహార పదార్థాలను, ముడిసరకులను పరిశీలిస్తూనే.  వాటి రుచి ఎలా ఉందని భక్తులను ఆరా తీశారు. టీ పొడి, కారం, బిర్యానీలో కలిపే రంగు, ఇతర పదార్థాల నమూనాలను సేకరించారు.

దాదాపు 90 శాతం హోటళ్లలో ఆహార పదార్థాలన్నీ నాణ్యత లేకుండా ఉన్నాయని. పాచిపట్టినవే భక్తులకు పెడుతున్నట్లు అధికారుల తనిఖీలో బహిర్గతమైంది.