ఎన్నికల సందర్భంగా పార్టీ నిర్ణయంతో విబేధించి పార్టీని వదిలివెళ్లిన గండ్ర సత్యనారాయణను అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నాలు షురూ చేశారు . చర్చలు జరుగుతున్న తీరును పరిశీలిస్తే గండ్ర మళ్లీ గులాబీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది . సత్తా చాటిన గండ్ర , పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ గండ్ర సత్యనారాయణ పోటీ చేశారు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ క్యాండిడేట్ గా ఎన్నికల బరిలో నిలబడి 54 , 283 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో ఉన్న మధుసూదనాచారి కంటే ఎక్కువ ఓట్లు సాధించి , ఇక్కడ ఎమ్మెల్యే గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి తర్వాతి స్థానంలో నిలిచారు.

గండ్రతో సంప్రదింపులు

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ కేటాయించడంతో విబేధించి ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గండ్ర పోటీ చేశారు . అయితే టీఆర్ఎస్ పార్టీ సభ్వత్వానికి రాజీనామా చేయలేదు అదే విధంగా ఆయనపై పార్టీ ఏ విధమైన చర్య తీసుకోలేదు సాంకేతికంగా చూస్తే గండ్ర సత్యనారాయణ ఇప్పటికీ టీఆర్ఎస్ నేతే అవుతారు . ఎన్నికల ఫలితాల తర్వాత గండ్ర మౌనంగా ఉంటున్నారు . ఏ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు . భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పుంజుకోవాలంటే గండ్రను పార్టీలోకి ఆహ్వానించాల నే నిర్ణయానికి వచ్చారు . ఈ మేరకు గండ్రతో తొలి దశ చర్చలు జరిగినట్లు సమాచారం , గండ్ర ఇంకా ఏ నిర్ణయం వెలువరించనప్పటికీ పార్టీలోకి వచ్చేందుకు పెద్దగా అభ్యంతరాలువ్యక్తం చేయలేదని తెలుస్తోంది .