{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581356508502","total_editor_time":1,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581356485733","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

మహబూబాబాద్: ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగు నిర్ములిద్దమని, అందకు 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నులి పురుగు నిర్మూలన మాత్రలు వేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ పిలుపునిచ్చారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో సోమవారం పిల్లలకు నిలిపురుగు నివారణ మాత్రలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: విద్యా శాఖ, మహిళ శిశు అభివృద్ధి శాఖ, వైద్యశాఖ అధికారులు సమన్వయంతో జిల్లాలో ఏ ఒక్క విద్యార్థి మిగలకుండా అందరికీ ఆల్బండజోల్ మాత్రలు వేయాలని అన్నారు. మిగిలిన పిల్లలను ఫిబ్రవరి 17 వ తేదీన మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. అనంతరం పిల్లలు ఏ విధంగా చేతులు కడుక్కోవాలో పద్దతులను వివరించారు.

నూతన కలెక్టరేట్ భవనం గడువులోగా పూర్తిచేయాలి:

Advertisement

నూతన కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణాలను గడువులోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఆకస్మికంగా సాలార్ తండా లో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ సముదాయాల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. నాణ్యతతో పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కలెక్టరేట్ సముదాయంలోని సి, డి బ్లాకులను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఏ, బి బ్లాక్ త్వరితంగా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ డేవిడ్, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు శాంకరయ్య, ఆర్డీఓ కొమురయ్య, తహశీల్దార్ రంజిత్, ప్రొజెక్ట్ మేనేజర్, తదితరులు పాల్గొన్నారు.

పచ్చదనం పరిశుభ్రతే పల్లె ప్రగతి లక్ష్యం:

పచ్చదనం పరిశుభ్రతే పల్లె ప్రగతి లక్ష్యమని, జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీలలో ట్రాక్టర్ లను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలేకరెట్ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో పల్లె ప్రగతి కార్యక్రమంపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 461 గ్రామ పంచాయతీలు ఉండగా 285 గ్రామాలకు ట్రాక్టర్ల కొనుగోలుకు ధ్రువపత్రాలు ఆయా బ్యాంకులలో సమర్పించామని తెలిపారు. 105 ట్రాక్టర్లకు లోన్లు మంజూరైనాయని పెండింగులో ఉన్న 180కి త్వరలోనే మంజూరుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. మిగిలిన 248 ట్రాక్టర్ల కొనుగోలు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలన్నారు.