• పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దు.
• ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చు.
• రోడ్డు ప్రమాదాలకు గురై కుటుంబానికి, తల్లిదండ్రులకు దుఃఖం మిగల్చవద్దు.

జిల్లా SP. కుమారి చందన దీప్తి IPS గారు మాట్లాడుతూ, జిల్లాలో ఒక్క రోడ్డు ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని, తద్వారా నిన్నటి రోజు రోడ్డు ప్రమాదాలు జరగలేదని తెలిపినారు, అదేవిధంగా అన్ని పోలీసు స్టేషన్స్ పరిధిలో ఈ నెలలో పది రోజులపాటు జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించి రోడ్డు భద్రత – ప్రమాదాల నివారణ పై ప్రజలకు, వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థులతో, వాహనదారులతో కలిసి ర్యాలీలు నిర్వహించినాము అని అన్నారు.

రోడ్డు ప్రమాదాలు జరిగి ఏ ఒక్కరు విలువైన జీవితాన్ని కోల్పోవద్దు అనే ఉద్దేశ్యముతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించామని అదేవిధంగా ప్రతి వ్యక్తి రోడ్డు పై ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించే విదంగా మరియు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించే విదంగా తయారు చేయాలి అని, అదే విదంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోయి, వారివారి కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నారని , కావున అట్టి ఫలితాలని ప్రజలకి తెలియచేయాలని చెప్పడం జరిగింది. అదేవిదంగా రోడ్డు నియమ, నిబంధన లపై వాహనదారులతో పాటు పాదచారులకు పూర్తి అవగాహన ఉన్నప్పుడే ప్రమాదాలను నివారించడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధికశాతం మంది హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు బలమైన గాయాలు తగిలి ప్రాణాలు కోల్పోతూ, తమ పై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నిత్యం ప్రమాదాలు జరిగే ప్రదేశాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి ప్రమాదం సంభవించడానికి గల కారణాలను పరిశీలించి రక్షన చర్యలు తీసుకోవడం జరిగినది అని అన్నారు. కేవలం మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం, అజాగ్రత్తవల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అని తెలిపినారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, హెల్మెట్, సీటు బెల్ట్ విధిగా ధరించాలని, అధికవేగంతో వాహనం నడపవద్దని, వాహన సామర్ధ్యానికి మించి రవాణా చేయవద్దని, రాంగ్ పార్కింగ్ , రాంగ్ రూట్ ప్రయాణం చేయవద్దని, ట్రిపుల్ రైడింగ్, బైక్ రేసింగ్ చేయవద్దు అని అన్నారు. అజాగ్రత్తతో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై కుటుంబాలకు దుఃఖం మిగల్చవద్దు అని, తల్లిదండ్రులకు గర్భశోకం పెట్టవద్దు అని కోరినారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని కోరుకుంటున్నామని తెలిపినారు.