పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి మంత్రి శ్రీ హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు.

టిడిపి-కాంగ్రెస్ పొత్తు నేపథ్యంలో 12 ప్రశ్నలను ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ ద్వారా మంత్రి సంధించడం జరిగింది.

1. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కూడా చంద్రబాబు తెలంగాణ రాష్ట్రం మీద వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. అదేమైనా మార్చుకున్నా అని టీడీపీ పొలిట్ బ్యూరోలో చంద్రబాబు తీర్మానం చేశారా?

2. తెలంగాణ వ్యతిరేక వైఖరి వీడానని బాబు హామీ ఇచ్చారా? పోలవరం ఏడు మండలాలు తిరిగి ఇచ్చేస్తామని బాబు హామీ ఇచ్చారా?

3. పోలవరం డిజైన్ మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారా?

4. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వద్దని బాబు కేంద్రానికి 30 లేఖలు రాశారు. బాబు వైఖరి మార్చుకుని మళ్ళీ కేంద్రానికి లేఖ ఇచ్చారా?

5. కాళేశ్వరం, సీతారామ తదితర ప్రాజెక్టులపై కేంద్రానికి ఇచ్చిన లేఖను బాబు వాపసు తీసుకున్నారా?

6. కృష్ణా, గోదావరి జలాల్లో వాటాకు సంబంధించి ట్రిబ్యునళ్లలో జరుగుతున్న వాదనల విషయంలో చంద్రబాబు వైఖరి మార్చుకుంటున్నారా?

7. తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీల కృష్ణా జలాలను బాబు రాకుండా అడ్డుకుంటున్నారు. ఏపీ మీద మేము పోరాడుతున్నాం. తెలంగాణకు నీళ్లు వద్దంటున్న బాబుతో నీళ్లు ఇప్పిస్తామని చెప్పించగలరా?

8. చంద్రబాబు తెలుగు జాతి అని మాట్లాడుతుంటారు. అది ఆయనకు అతకదు. తెలంగాణలో అన్ని ప్రాంతాల వారు ఉంటే మిషన్ భగీరథ ద్వారా అందరికీ నీళ్లిచ్చే ప్రాజెక్టును బాబు వ్యతిరేకిస్తున్నారు. దానిపై ఆయన వైఖరి మారిందా?

9. బీజేపీ మద్దతుతో 460 మెగావాట్ల సీలేరు హైడెల్ కేంద్రాన్ని బాబు లాక్కున్నారు. దాన్ని తెలంగాణకు బాబుతో తిరిగి ఇప్పిస్తారా?

10. త్రిశంకు స్వర్గంలో ఉన్న 1350 మంది ఉద్యోగులను ఏపీ తీసుకోవడానికి బాబును ఒప్పిస్తునారా?

11. నిజాం వారసత్వంగా తెలంగాణకు సంక్రమించాల్సిన ఆస్తులపై బాబు వాదన ఏమైనా మార్చుకున్నారా?.

12. హైకోర్టు, మిగతా విభజన హామీలపై బాబుతో హామీ తీసుకున్నారా?.