పురుషాంగానికి క్యాన్సర్ వస్తుందని తెలుసా ?

పురుషాంగానికి క్యాన్సర్ సోకుతుందని చాలా మందికి తెలియదు. సరైన సమయంలో చికిత్స చేయకపోతే ఇది ప్రాణాలనే బలితీసుకుంటుంది. పురుషాంగంలో ఒకే చోట అసాధారణరీతిలో కణవిచ్చిన్నం జరగడంవల్ల పురుషాంగానికి క్యాన్సర్ సోకుతుంది. పురుషాంగంపై చర్మం , లేదా పురుషాంగం టిప్ పై రంగు మారడం దీనికి సంకేతం. పురుషాంగం చివర ఉండే వదులుగా ఉండే చర్మం లో అసాధారణ మార్పులుకూడా పురుషాంగం క్యాన్సర్ కు సంకేతాలు. పురుషాంగం చర్మం మొద్దుబారడం , పురుషాంగంపై రక్తం కారే గడ్డలు , బుడిపెలు, ఎంతకీ తగ్గని దురద , పురుషాంగం నుంచి రసికారడం , పురుషాంగం ఉబ్బడం తదితర లక్షణాలు పురుషాంగం క్యాన్సర్ అనుమానించడానికి కారణాలుగా భావించాలి.

పురుషాంగం క్యాన్సర్ సున్తీ చేయించుకోవడం ద్వారా అరికట్టవచ్చు .
పురుషాంగం క్యాన్సర్ ఎలా సంక్రమిస్తుంది.

1. 35 శాతం పురుషాంగం క్యాన్సర్ HPV అనే వైరస్ వల్ల వస్తుంది. ఇది సెక్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది.

2. 60 ఏళ్ళు పైబడినవారికి పురుషాంగం క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

3. ఎయిడ్స్ వ్యాదికూడా దీనికి కారణం.

4. పొగ తాగడం కూడా పురుషాంగం క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం.

ఇవికాక వంశ పారంపర్యంగా కూడా పురుషాంగం క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.