జయశంకర్ భూపాలపల్లి జిల్లా: చిట్యాల మండల కేంద్రలోని బాలికల గురుకుల పాఠశాల (వెలుగు హాస్టల్)లో కలుషిత ఆహారం తిని 40మంది బాలికలు అస్వస్థతకు గురి కావడంతో వారిని చూసి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి గారు, వారు మాట్లాడుతూ ఈ సంఘటన జరగడం ఈ హాస్టల్లో రెండవ సారి ఇంతకుముందు 30 మంది బాలికలు ఇదే హాస్టల్ లో నెలరోజులు గడవక ముందే మళ్ళీ జరగడం. ఇది పూర్తిగా అధికారుల వైఫల్యం అని సరైన పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణం అన్నారు. దీనికి కారణమైన వారిని విధుల్లోనుంచి తొలగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి పాపయ్య గారు అధికార ప్రతినిధి పాలేపు రాంబాబు గారు మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల రఘు బుర్ర వెంకటేష్ అకునూరి సదయ్య తదితర బీజేపీ నాయకులు.