పెండ్లిన నలభై రోజులకే విధి వారిని విడదీసింది . బస్సు రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు భార్య ప్రాణాలు బలిగొంది . భర్త కొనప్రాణంతో కొట్టు మిట్టాడుతున్నాడు . ఈ ఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది . వివరాల్లోకి వెళితే మహబూ బాబాద్ జిల్లా గంగారం మండలానికి చెందిన పందెం గ్రామానికి చెందిన పూనం లావణ్య , రవీందర్ 40 రోజుల క్రితం వివాహం చేసుకు న్నారు . ములకలపల్లి మండలం గురవాయి గూడెంలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి బైక్ వెళ్లి బుధవారం రాత్రి తిరుగు ప్రాయాణం అయ్యారు . కొత్తగూడెం దాటిన తర్వాత అనిశా ట్టిపల్లి వద్ద తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో కొత్తగూడేనికి చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ప్రమాదంలో లావణ్య అక్కడికక్కడే మృతి చెందింది . తీవ్రంగా గాయపడిన రవీందర్ ను కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు . పక్కటెముకలు విరిగి గుండెలో గుచ్చుకోవడం తో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించా రు . చుంచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .