Advertisement

అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు పెట్టడానికి అక్రమంగా తరలిస్తున్న రూ.6 కోట్లను పెంబర్తి వద్ద సీజ్ చేసిన డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి.. ఎవరు పంపించారు. దానికి సంబంధించిన కూపీ లాగేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ ఆధ్వర్యంలో విచారణను వేగవంతం చేస్తున్నారు.

సీజ్ అయిన డబ్బు వరంగల్ తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర, పరకాల ఎమ్మెల్యే అభ్యర్థి కొండా సరేఖ, ఖమ్మం టిడిపి నుండి పోటీ చేసిన నామ నాగేశ్వర్‌రావులకు సంబంధించినదిగా పోలీసులు తేల్చారు. అయితే ఈ డబ్బు వారికి ఎక్కడి నుండి చేరింది..? ఎవరు పంపారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. డబ్బుతో దొరికిన కీర్తి కుమార్‌జైన్ పోలీసులకు అందించిన సమాచారం మేరకు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఆ విచారణలో వచ్చిన డబ్బు సింగపూర్ నుండి చైన్నైకి, చెన్నై నుండి కీర్తికుమార్ ద్వారా వరంగల్‌కు వస్తుండగా పోలీసులు పెంబర్తి వద్ద పట్టుకున్నారు.

అయితే సింగపూర్ నుండి ఎంత మొత్తం తెలంగాణ ఎన్నికలకు వచ్చింది.. ఆ డబ్బును సింగపూర్ నుండి ఎవరు పంపారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.