ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన వర్ధన్నపేట పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వర్ధన్నపేటకు చెందిన మైస వీరేశంతో హసన్‌పర్తి మండలం ముచ్చర్ల నాగారానికి చెందిన మౌనికకు ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. దంపతులు బాగానే ఉండేవారు. కాగా మంగళవారం రాత్రి తన గదిలో దూలానికి చున్నీతో ఉరివేసుకుని మృతిచెందింది.
దీంతో పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.

కుటుంబంలో ఏమైనా గొడవలా లేక మరేదైనా కారణమా తెలియరాలేదు. మౌనిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసి విచారణ జరుపుతున్నామని ఎస్సై సంపత్‌ తెలిపారు.