బాలీవుడ్ మహిళా నిర్మాత ఏక్తా కపూర్‌ పెళ్లికాకుండానే తల్లయ్యింది. ఏక్తా సరోగసి పద్ధతి ద్వారా మగ బిడ్డకు జన్మనిచ్చింది. జనవరి 27న సరోగసి ద్వారా ఏక్తా కపూర్ తల్లి అయినట్లు సమాచారం. త్వరలోనే తన బిడ్డను ఇంటికి తీసుకురానున్నారు. గతంలో ఆమె సోదరుడు తుషార్‌ కపూర్‌ కూడా సరోగసి ద్వారా తండ్రైన సంగతి తెలిసిందే.

Advertisement

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు జితేంద్ర సంతానమైన ఏక్తా కపూర్, తుషార్‌ కపూర్‌ ఇద్దరూ అద్దె గర్భం ద్వారా పిల్లలను పొందడం విశేషం. ఏక్తా కపూర్ కొందరు బాలీవుడ్ ప్రముఖులతో డేటింగ్ చేసినట్లుగా పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. అయితే అందులో ఏదీ కూడా పెళ్ళి వరకూ వెళ్ళలేదు. అంతేకాకుండా ఏక్తా కపూర్ పలు ఇంటర్వ్యూల్లో తనకు పెళ్ళి చేసుకోవాలని లేదంటూ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏక్తాకపూర్‌, టివి షో కసౌతి జిందగీ కే పునర్నిర్మాణ పనుల్లో బిజీగా ఉంది. ఈ మధ్యే వీరె ది వెడ్డింగ్‌, లైలా మజ్ను మూవీలను ఏక్తా నిర్మించారు.