పెండ్లి చేయడం లేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI అరవింద్‌గౌడ్ కథనం ప్రకారం.. గౌలిపురా మేకలమండి ప్రాంతానికి చెందిన N. శోభ కుమారుడు రాహుల్ (28) వెల్డింగ్ వర్క్‌షాపు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో రాహుల్ ఓ యువతిని ప్రేమించాడు. ఆరు నెలల క్రితం ప్రేమ విఫలమవ్వడంతో లలితాబాగ్ రైల్వేబ్రిడ్జి పట్టాలపై ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు కాపాడారు.
కొన్ని వారాలుగా పెండ్లి చేయాలని రాహుల్కు , కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి రాహుల్ గదిలో చీర కొంగుతో ఇనుపరాడ్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.