దంగర్‌పూర్ జిల్లా సగ్వార్ ప్రాంతంలో ఓ యువకుడు రష్యాలో ఎంబిబిఎస్ చదువుతున్నాడు. రష్యాకు వెళ్లేముందు మైనర్ బాలికతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఒక రోజు వాళ్లిద్దరు కలుసుకోవాలని హోటల్‌లోని రూమ్‌ను బుక్ చేశారు. అనంతరం మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారం చేశాడు. రష్యా నుంచి భారత్‌కు వచ్చిన తరువాత పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.

Advertisement

ఈ మధ్యలో నిందితుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనని చెప్పేసరికి బాలిక స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోస్కో చట్ట కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు బాలికతో నిందితుడు వాట్సాప్, సోషల్ మీడియాలో చాటింగ్ చేసిన ఆధారాలు ఆమె వద్ద ఉన్నాయి. దీంతో రష్యాలో ఉన్న భారతీయ ఎంబిసి అధికారులకు రాజస్థాన్ పోలీసులు సమాచారం ఇచ్చారు. జులై నెలలో హర్యానాకు చెందిన దీపక్ అనే యువకుడు రష్యా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.