ముగ్గురిపై కేసు నమోదు

Advertisement

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వాజేడు మండల పరిధిలోని ధర్మవరం గ్రామానికి చెందిన తోట ముకుందరావు కుమార్తె అశ్విని (24), అదే గ్రామానికి చెందిన బొల్లె నాగ్రేందబాబు ఐదేళ్లుగా,

ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో తనను వివాహం చేసుకోవాలని అశ్విని అడగడంతో నాగేంద్రబాబు మొహం చాటేశాడు. దీంతో 15రోజుల క్రితం అశ్విని ఆత్మహత్యాయత్నం చేసి, ప్రాణాలతో బయటపడింది. అనంతరం అశ్విని నాగేంద్రబాబు ఇంటికి వెళ్లి అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం తనను వివాహం చేసుకోవాలని అశ్విని మరోసారి అడిగినా నాగేంద్రబాబు ఒప్పుకోకపోవడంతో, అదే ఇంట్లో పురుగులమందు తాగింది వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి,

ప్రథమ చికిత్స అనంతరం ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది, నిందుతుడు శ్రీరాములుపై కేసు నమోదు చేసినట్లు సి తెలిపారు.