ప్రధాని నరేంద్ర మోడీ మీద ఉన్న అభిమానంతో జయ దవేను పెళ్లి చేసుకున్నాను . కానీ మానసికంగా , శారీరకంగా అతను నన్ను హింసిస్తున్నాడు ‘ అని ఆవేదన వ్యక్తం చేశారు అల్చికా పాండే . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారేవరైనా అల్పికను త్వరగానే గుర్తు పడతారు . ఎందుకంటే నరేంద్ర మోడీ మీద ఉన్న అభిమానంతో సోషల్ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది అల్పిక . వివరాలు…

గుజరాత్ కు చెందిన జయ దవే అనే వ్యక్తి గత ఏడాది కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఓ ట్వీట్ చేశాడు . ఈ ట్వీట్లు అల్పిక పాండే లైక్ చేసింది . అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఫేసబుక్ స్నేహం ప్రారంభమైంది ఇద్దరికి విపరీతమైన అభిమానం . ఆలోచనలు కలిశాయి కాబట్టి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ జంట . ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్ 31న జయ దవే , మేమిద్దరం కలసి మాట్లాడుకున్నాం . మేము ఇద్దరం మోడీకి మద్దతు తెలుపుతున్నాం . మేమిద్దరం దేశం కోసం జీవించాలనుకుంటున్నాం . అందుకే కలసి జీవించాలని నిర్ణయించుకున్నాం ‘ అని ట్వీట్ చేశాడు . అప్పట్లో ఈ ట్వీట్ తెగ వైరల్ అయింది కూడా . ఆ తరువాత గత జనవరిలో వీరిద్దరు వివాహం చేసుకున్నారని సమాచారం , కానీ పెళ్లైన నెల రోజులకే వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ప్రారంభమయ్యాయి . ఈ క్రమంలో తాను పడుతున్న బాధల గురించి ట్వీట్ చేశారు అల్పిక . ‘ నరేంద్ర మోడీ మీద ఉన్న అభిమానంతో facebook లో పరిచయం అయిన జయ దేవ ని వివాహం చేసుకున్న అమ్మాయిని నేనే అయితే ,

ఈ బంధంలోని మరో కోణం గురించి కూడా మీకు తెలియాలి నా భర్త నన్ను శారీరకంగా మానసికంగా చాలా హింసిస్తున్నాడు . ఈ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను ‘ అంటూ వాపోయింది అల్బిక . అంతే కాక జయ దవేకి నా మీద చాలా అనుమానం . ప్రతి క్షణం నేను ఏమి చేస్తున్నాననేది అతనికి తెలియాలి . నాకు తెలియకుండా నా ఫోన్ ను చెక్ చేసేవాడు . నా వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ ఇవ్వడు . నేను ఒంటరిగా బయటకు వెళ్లడానికి కూడా వీలుల్లేదు .

గౌరవం పేరుతో ఎవర్నో ఒకర్ని నాకు తోడుగా పంపిస్తాడు . నన్ను బాధ పెట్టే విషయంలో అతని కుటుంబ సభ్యులు కూడా అతనికే మద్దతు ఇస్తారు ‘ అని ట్వీట్ చేసింది . ఈ టార్చర్ తట్టుకోలేక జయ దవే ఇంటి నుంచి బయటకు వచ్చేశానని , ప్రస్తుతం తల్లిదండ్రులతో కలసి ఉంటున్నానని చెప్పుకొచ్చింది అల్పిక . అంతే కాక పెళ్లి చేసుకోవాల్సిందిగా జయ దవేనే తనను బలవంతపెట్టాడని ఆరోపించింది .