పెళ్లి చేసుకోబోతున్న సింగర్ సునీత !!

సునీత త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. సింగర్ సునీతగా పాపులర్ అయిన ఆమె కొన్నేళ్ల క్రితమే తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు.

సునీతకి 19 ఏళ్ల వయసులోనే పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయిన ఆమె చాలా ఏళ్లుగా అతడికి దూరంగా ఉంటున్నారు. మరో పెళ్లి చేసుకుంటారా.. అనే ప్రశ్న సునీతకు చాలా ఏళ్లుగా ఎదురవుతోంది. దీనికి ఆమె ఎప్పుడూ లేదనే సమాధానం ఇచ్చేవారు. కానీ గత కొన్నాళ్లుగా ఆమె పెళ్లి విషయం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెకు కాబోయే భర్త ఐటీ కంపెనీ యజమాని అని, ఆయన కూడా ఇదివరకే విడాకులు తీసుకున్నారని సమాచారం. ఇప్పటి వరకూ పెళ్లి విషయాన్ని సునీత అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. గత నెలలోనే సునీత నానమ్మ చనిపోయారు. సునీత ఇన్నాళ్లూ పిల్లలే ప్రాణంగా బతికారు. వాళ్లు పెద్దవాళ్లవడంతో సునీత మరో పెళ్లి చేసుకోవాలనుకోవడం సరైన నిర్ణయమేనని ఆమె గురించి తెలిసినవారు అభిప్రాయపడుతున్నారు.