పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆదిత్య కపూర్ తనపై పలుసార్లు అత్యాచారం చేశాడని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. తెలుగు నటిపై అత్యాచారం జరిగింది. ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి పేరుతో ఓ ఫిట్‌నెస్ ట్రైనర్ ఆదిత్య కపూర్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలుగు సినిమా నటి ఆరోపించింది. పెళ్లి సాకుతో ట్రైనర్ తనతో సంబంధం పెట్టుకున్నాడని ఆమె చెబుతోంది. పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడని బాధితురాలు చెబుతోంది. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అనగానే మాత్రం ఆ మాట ఎత్తకుండా మోసం చేస్తూ వచ్చాడని చెప్పింది. అయితే బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అయతే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు కూఫీ పరేడ్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో కేసు నమోదు అయ్యింది. ఫిట్‌నెస్ ట్రైనర్ ఆదిత్య కపూర్‌పై తనపై పలుసార్లు అత్యాచారానికి కూడా పాల్పడ్డారని బాధితురాలు చెబుతోంది. పెళ్లి సాకుతో ట్రైనర్ తనతో సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఆరోపిస్తోంది. ఆ తర్వాత పెళ్లి మాటెత్తడం మానేశాడని, అడిగితే తనను దూషించడమే కాకుండా దాడి కూడా చేశాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన చిత్రాలను బయటకు తీస్తానని బెదిరించడమే కాకుండా చంపేస్తానని కూడా హెచ్చరించాడని ఆమె పేర్కొంది. ఆమె ఫిర్యాదుపై ఆదిత్య కపూర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే 2016 నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఆమె పలు చిత్రాల్లో నటించింది.