భార్య తనతో సరిగ్గా ఉంటలేదని ఆమె కోరుకున్న వ్యక్తితో భార్యను ఇచ్చి పెళ్లి చేశాడు ఓ భర్త. ఈ సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది. స్థానికులు పేర్కొన్న వివరాల ప్రకారం: బీహార్ లోని బల్తార్ గ్రామానికి చెందిన వ్యక్తి బెంగళూరులో పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. అయితే, అతనికి రెండు సంవత్సరాల క్రితం ఓ మహిళతో పెళ్లి అయ్యింది. అప్పటి నుంచి తన భర్తతో ఆమె ఏరోజూ సంతోషంగా ఉండడంలేదు.

ఈ సందర్భంలో ఆమెను ఏమైందని భర్త నిలదీశాడు. దీంతో అసలు విషయం చెప్పింది. తాను పెళ్లికి ముందు ఓ వ్యక్తిని ప్రేమించానని, ఆ విషయం తెలిసి కూడా తన తల్లిదండ్రులు పెళ్లి చేశారని చెప్పింది. అందుకే అదోలా ఉన్నట్లు చెప్పింది. అది విన్న భర్త మొదటగా షాకయ్యాడు. ఆ తర్వాత ప్రియుడికి భార్యను ఇచ్చి పెళ్లి చేశాడు. అనంతరం అతని వెంట తన భార్యను పంపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.