వనస్ధలిపురంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్ళైన 8 నెలలకే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నివేదిత అనే మహిళ ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 8 నెలల కిందట సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రఘు ప్రసాద్ తో నివేదిత వివాహం జరిగింది. భర్తతో రాత్రి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. పెళ్ళైన నాటి నుంచి భర్త వేధింపులకు గురిచేసేవాడని నివేదిత తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. భర్త ,అత్తమామల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిపై మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకు తరలించారు.