పేదింటి బిడ్డనైన నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి

వరంగల్ తూర్పు తెరాస అభ్యర్ది నన్నపునేని నరేందర్

తెలంగాణా రాష్ట్ర సమితి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్దిగా నన్నపునేని నరేందర్ నామినేషన్ వేసారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఆపద్దర్మ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ,రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్,ఎంపీ పసునూరి దయాకర్,లింగపల్లి కిషన్ రావు,బస్వరాజు సారయ్య,బొల్లం సంపత్ కుమార్ హాజరయ్యారు..

నామినేషన్ కు ముందు తెరాసా అభ్యర్ది నన్నపునేని నరేందర్ వివిద చోట్ల ప్రత్యేక పూజలు ప్రార్దనలు చేసారు.వరంగల్ బట్టలబజార్ లోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో,మండిబజార్ లోని మసీద్ లో,లేబర్ కాలనీలోని సీబీసి చర్చ్ లో,భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రార్ధనలు చేసారు.

నామినేషన్ వేసిన అనంతరం పాత్రికేయుల సమావేశంలో నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ పేదింటి బిడ్డనైన నాకు ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప అవకాశం కల్పించారని,వరంగల్ తూర్పు నియోజకవర్గం అంటే శాంతికి సూచిక అని ఈ నియోజకవర్గ ప్రజలు చైతన్యం కలిగిన వారని,పేదింటి బిడ్డనైన నన్ను ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని,తూర్పు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని,నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన కేసీఆర్ గారికి శిరస్సువంచి పాదావందనాలు అని,బ్రతికి ఉన్నంత కాలం పార్టీకి, ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఈ సందర్బంగా కార్పోరేటర్లు, తెరాసా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.