{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578549593791","total_editor_time":0,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578549560135","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

మహిళ వద్ద బంధువులు ఎవరు లేకపోవడంతో ఆమెకు తోడుగా ఉన్న ఆయాలను ఆమె ప్రశంసించారు.

జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పటల్ లో నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ ప్రసవించింది. ఆ మహిళ వద్దకు ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ వెళ్ళి జరిగిన విషయం అడుగగా వారిది గణపురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమని, నిన్న రాత్రి మగ శిశువు జన్మించాడని, అయితే శిశువుకు (పిడిసె) మూర్ఛ రావడంతో తల్లిని ఇక్కడ ఉంచి శిశువును మెరుగైన వైద్యం కోసం వరంగల్ కు తీసుకువెళ్లాలని వైద్యులు తెలిపారు.

వారిది నిరుపేద కుటుంబం కావడంతో అక్కడికి వెళ్ళడానికి, ఆస్పత్రిలో చూపించడానికి డబ్బులు లేకపోవడంతో తన భర్త భిక్షాటన చేశాడని, కొంత మంది చందాలు వేసుకుని ఆస్పత్రికి పంపించారని పిల్లాడి తల్లి తెలిపింది. ఆమె కన్నీటి గాధ విన్న తస్లీమా మహమ్మద్ చలించిపోయారు. బాబు ఉన్న ఆస్పత్రికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని, తల్లికి రూ.1000 రూపాయలు అందించారు. బాబు మెరుగైన వైద్యం కోసం సర్వర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మహిళ వద్ద బంధువులు ఎవరు లేకపోవడంతో ఆమెకు తోడుగా ఉన్న ఆయాలను ఆమె ప్రశంసించారు. ఆమె వెంట ట్రస్టు సభ్యులు సుమన్, రమేష్, శ్రీను, వినోద్, గణేష్, తదితరులు ఉన్నారు.