ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘ అడ్వాన్స్ మెంట్ ఇన్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ’ పైన సదస్సును నక్కలగుట్టలోని ల్యాండ్ మార్క్ హోటల్ లో TSNPDCL ఉద్యోగులకు నేడు గురువారం రోజున సదస్సు నిర్వహించారు . ఈ సదస్సుకు ముఖ్య అతిథిలుగా CMD శ్రీ అన్నమనేని గోపాల్ రావు గారు , డైరెక్టర్లు శ్రీ బి . వెంకటేశ్వర రావు , శ్రీ డి . నర్సింగరావు , శ్రీమతి పి . సంధ్యారాణి , శ్రీ పి . గణపతి , శ్రీ పి . మోహన్ రెడ్డి గార్లు విచ్చేశారు . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి CMD శ్రీ అన్నమనేని గోపాల్ రావు గారు మాట్లాడుతూ సాంకేతిక పురోగతిపై ఆయిల్ లో వస్తున్న మార్పుల వలన ట్రాన్స్ఫార్మర్ల మన్నిక కాలం చాలా పెరుగుతుందని అన్నారు . పోటీ ప్రపంచంలో నాణ్యత , మన్నికతో పాటు సరసమైన ధరకు అందించాలని సూచించారు . ఎప్పటికప్పుడు ఆయిల్ లో నూతన పద్ధతులు అవలంబించాలని తద్వారా ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు తగ్గి వినియోగదారునికి మెరుగైన సేవలందించడం జరుగుతుందని అన్నారు . అలాగే డిస్కంలకు కూడా లబ్ది చేకురుతుందని అన్నారు . ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారు సాంకేతిక పురోగతిపై సదస్సు నిర్వహించడం మంచి పరిణామం అన్నారు . కొత్తగా టెక్నాలజీని ఉద్యోగులకు తెలియజేయడం వలన ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు చాలా తగ్గే అవకాశం ఉందని అన్నారు . ఈ కార్యక్రమంలో NPDCL అధికారులు పాల్గొన్నారు …