సోషల్ మీడియాలో కామెంట్లపై అరెస్ట్ చేస్తే !
పోలీసులను జైల్లో పెట్టిస్తాం !! సుప్రీంకోర్టు వార్నింగ్

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 66 a రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసినా ఆ సెక్షన్ కింద కేసులు పెట్టి వేదించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ చట్టం ప్రాథమిక హక్కులు కబళించేదని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేదని 2015లో సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది.

అయితే సోషల్ మీడియాలో కామెంట్లపై కొన్ని సందర్భాలలో ఈ సెక్షన్ కింద కేసులు పెట్టడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఇక మీదట ఇలా చేస్తే పోలీసులనే జైల్లో పెడతామని హెచ్చరించింది.