జిల్లా హెడ్ క్వార్టర్స్ కు బందోబస్త్ నిమిత్తం వివిధ పి.ఎస్.ల నుండి ఏ.ఆర్ హెడ్ క్వార్టర్స్ కు వచ్చే సిబ్బందికి, మరియు వేరే జిల్లాల నుండి మెదక్ జిల్లాకు బందోబస్త్ నిమిత్తం వచ్చే పోలీస్ సిబ్బందికి వుండడానికి సౌకర్యం కొరకు మెదక్ జిల్లా ఏ.ఆర్. హెడ్ క్వార్టర్స్ నందు నూతనంగా నిర్మించిన బారక్ లను మెదక్ జిల్లా ఎస్.పి. గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు. తదుపరి పూజలు నిర్వహించారు,

ఈ సంధర్భంగా ఎస్.పి. గారు మాట్లాడుతూ; పారదర్శకంగా విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది, వారి వ్యవహారశైలి, ఇతర వసతులు ఆ భరోసాని ఇస్తాయి. సర్వకాలసర్వాస్థల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకు, ప్రత్యేక సందర్భాల్లో బందోబస్తు విధుల కోసం వచ్చే సాయుధ బలగాలకు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా విశ్రాంతి భవనం డిజైన్ చేశాం అని పేర్కొన్నారు. అలాగే ఏ.ఆర్. హెడ్ క్వార్టర్స్ సంధర్శించి సిబ్బంది సమస్యలు అడిగి తెల్సుకున్నారు.