పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: జిల్లా ఎస్.పి. కుమారి చందన దీప్తి ఐ.పి.ఎస్.
ఈ రోజు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా సంధర్భంగా జిల్లా పోలీసు ఎ.అర్. హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా కలెక్టర్ శ్రీ. కె. ధర్మారెడ్డి గారు, జిల్లా పోలీసు ఉన్నత అధికారి కుమారి చందన దీప్తి ఐ.పి.ఎస్ గారు మరియు అదనపు ఎస్.పి. శ్రీ. డి. నాగరాజు గారు జిల్లా పోలీసు అమర వీరుల స్థూపానికి నివాళలు అర్పించారు. ఈ సంధర్భంగా జిల్లా అదనపు ఎస్.పి. గారు గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 414 మంది పోలీస్ ఆమరవీరుల పేర్లను చదివినారు, వీరందరినీ జిల్లా ఎస్.పి.గారు మరియు జిల్లా కలెక్టర్ గారు స్మరించుకోవడం జరిగినది. అనంతరం జిల్లా ఎస్.పి.గారు మరియు జిల్లా కలెక్టర్ గారు, అదనపు ఎస్.పి. శ్రీ. డి. నాగరాజు గారు, మెదక్ డి.ఎస్.పి. కృష్ణ మూర్తి గారు, తూప్రాన్ డి.ఎస్.పి. రాం గోపాల్ రావు గారు, ఎ.అర. డి.ఎస్.పి. శ్రీ మురళి గారు, జిల్లా సిఐ.లు ఎస్ఐ.లు, ఆర్.ఐ., ఆర్.ఎస్.ఐ. గార్లు, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాగుచ్చాలు వుంచి నివాళులు ఆర్పించినారు.
ఆ తర్వాత ఆర్.ఐ సురపు నాయుడు గారి సారధ్యంలో సాయుధ పోలీసుల ‘శోక్ శ్రస్త్’ చేసి మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.