జిల్లా పోలీస్ ఎ.ఆర్. హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా పోలీస్ AR సిబ్బందికి యొక్క సమస్యలు తెలుసుకొనుటకు పోలీస్ దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎ.ఆర్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి మరియు అదేవిధంగా వారియొక్క సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఇందులో భాగంగా తమ సమస్యలను తెలిపిన సిబ్బంది యొక్క సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలని సంబంధిత డి.పి.ఓ. సిబ్బందిని సూచించారు.

సిబ్బంది ఉద్యోగపరంగా ఏ సమస్య వచ్చిన తమ దృష్టి కి తీసుకురావాలని తెలిపారు. అలాగే పోలీస్ ఉద్యోగ రిత్యా ఒత్తిడి ఎక్కువగా వుంటుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి సిబ్బంది ప్రతిరోజూ యోగా చేయాలని, జిల్లా పోలీస్ ఎ.ఆర్. హెడ్ క్వార్టర్స్ నందు ఏర్పాటు చేసిన వ్యాయామ శాలలో ప్రతి రోజు వచ్చి వ్యాయామం చేయాలని అన్నారు. పోలీస్ సిబ్బంది ప్రజలతో మమేకమై, ప్రజలకు మంచి సేవలు అందించే దిశలో తమ యొక్క విధులు నిర్వహించి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకోని రావాలని సూచించారు.

ఆ తర్వాత ఎ.ఆర్. హెడ్ క్వార్టర్స్ భవనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి. శ్రీ.డి. నాగరాజు గారు, ఆర్.ఐ. సురపునాయుడు గారు, ఆర్.ఎస్.లు, ఎ.ఆర్. సిబ్బంది, మరియు డి.పి.ఓ. సిబ్బంది పాల్గొన్నారు.