జిల్లాలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు హాజరైన రామడుగు మండలం వెలిశాల గ్రామానికి చెందిన మమత అనే యువతి కానిస్టేబుల్ సెలక్షన్ లో భాగంగా పరుగుపందెంలో పాల్గొనగా స్పృహ తప్పి కుప్పకూలింది. పరుగుపందెం ముగిశాక కాసేపటికే గుండెపోటుతో ఆమె చనిపోయింది. యువతి తండ్రి సంపత్ ఆటో డ్రైవర్. ఈయ‌న‌కు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. మృతురాలు మమత పెద్దమ్మాయి. ఫిట్ నెస్ పరీక్షల్లో పాల్గొన్న మరో అభ్యర్థి కాలు విరిగినట్లు సమాచారం. అలాగే స్పృహ తప్పిపడిపోయిన మరో ఇద్దరు అభ్యర్థులను ఆస్పత్రికి తరలించారు. ఇద్దరిని జగిత్యాలకు చెందిన రశ్మిత, చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన మనీషాగా గుర్తించారు…