లభ్యమైన ఇద్దరు మహిళల మృతదేహాల కలకలం. లంగర్ హౌస్ వద్ద మూసీ నదిలో ఇవి బయటపడ్డాయి. ఇద్దరు మహిళల మృతదేహాలను గమనించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. మొన్న పౌర్ణమి కావడంతో క్షుద్రపూజలు చేసిఉంటారని, అనంతరం చంపేసి మూసీ నదిలో వదిలేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అర్ధనగ్నంగా ఉన్న మహిళల తలలకు బలమైన గాయాలు ఉన్నాయి. క్లూస్‌టీమ్‌ సంఘటన స్థలి నుంచి ఆధారాలు సేకరించారు.

Advertisement

పిల్లర్‌ నెంబర్‌ 117 నుంచి జనప్రియ అపార్ట్‌మెంట్‌కు వెళ్లే రహదారి పక్కన మూసీ నది ఒడ్డున ఈ మృతదేహాలు స్థానికులకు కనిపించాయి. ఇద్దరి మెడకు ఒకే చీర చుట్టుకొని ఉంది. ఒక మహిళకు తల వెనుక భాగంలో, మరో మహిళకు తల ఎడమ వైపున బలమైన గాయాలు ఉన్నాయి. ఈ ఇద్దరు మహిళ వయస్సు 40 – 50 సంవత్సరాల మధ్యే ఉంది. ఒకరి చేతికి పసుపు ఉండడం, చేతికి పసుపు కంకణం ఉండడం పలు అనుమానాలకు దారితీస్తోంది.

వారిద్దరినీ బ్లూకలర్‌ చెక్స్‌ చీరలో చుట్టి ఉంచారు. ఇద్దరి కాళ్లకూ మెట్టెలు ఉన్నాయి. ఓ మహిళ మెడలో బంగారు గొలుసుతో పాటు పచ్చని గాజుల పెంకులూ కనిపించాయి. ఒడ్డున కొత్త చీర ! పూజా సామగ్రి దర్శనమివ్వడంతో నరబలి కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.