ప్రచారంలో భాగంగా అన్నం తినిపిస్తున్న మధుసూదనాచారి .

ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కేసీఆర్‌ సూచించారు. దీంతో స్పీకర్‌, భూపాలపల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మధుసూదనాచారి విజృంభించారు. భూపాలపల్లిలోని సుభా్‌షకాలనీలో పర్యటిస్తుండగా లచ్చయ్య అనే వృద్ధుడు అన్నం తింటూ స్పీకర్‌ కంటపడ్డాడు. అంతే. వెంటనే అతని దగ్గరికి వెళ్లి పక్కనే కూర్చున్నారు. కంచంలో అన్నాన్ని కలిపి తాతకు స్వయంగా తినిపించారు.

పాడె మోసిన మధుసూదనాచారి

భూపాలపల్లిలోని రాంనగర్‌ కాలనీలో ప్రచారం చేస్తుండగా, పెండ్యాల కిషన్‌ అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో చనిపోయినట్టు తెలిసింది. స్వతంత్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు అప్పటికే మృతుడి కుటుంబాన్ని పరామర్శించినట్టు కూడా సమాచారం అందింది. దాంతో స్పీకర్‌ వెంటనే పరామర్శకు వెళ్లారు. అయితే ఆయన అక్కడికి చేరేటప్పటికే మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళుతున్నారు. దీంతో స్పీకర్‌ ఎదురెళ్లి పాడె మోసారు. ఆయనతో పాటు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కూడా తలా ఓ చేయి వేసి భుజానికెత్తుకున్నారు.