విద్యుత్ భద్రతా వారోత్సవాలు మే 1 నుండి 7 వరకు NPDCL కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ పరిధిలోని 16 సర్కిళ్ళలో నిర్వహిస్తున్నామని CMD శ్రీ అన్నమనేని గోపాల్ రావు గారు తెలిపారు . ఈ సందర్బంగా వినియోగదారులు చాలా వరకు “నాణ్యత లేని గృహో- పకరణాలు , ప్రమాణాలను పాటించకుండా, విద్యుత్ ఉపకరణాలను ఏర్పాటు చేయడం వలన విలువైన ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నది” . వినియోగదారులు తమ తమ విద్యుత్ అవసరాలకు గాను నాణ్యత మరియు ISI స్టాండర్డ్ పరికరాలు , విధానాలు పాటించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు . అందుచేత నాణ్యమైన ఐఎస్ఐ స్టార్ రేటెడ్ విద్యుత్ పరికరాలు ఉపయోగించగలరని కోరుతున్నాను . స్వీయ నియంత్రణచాలా ముఖ్యం అని అన్నారు .

విద్యుత్ వినియోగదారులు ఈ క్రింది విద్యుత్ ప్రమాదాల నివారణ సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి :

  • ముఖ్యంగా రైతు సోదరులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం , వ్యవసాయ పంపు సెట్లను వాడుతున్నప్పుడు కరెంటు మోటార్లను కాని, పైపులను కాని , ఫుట్ వాల్వులను కాని ఏమరపాటుతో తాకకూడదు . వ్యవసాయ పంపుసెట్లను మరియు స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయవలెను . విద్యుత్ ప్రమాదాలు ఎర్త్ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయి . ఎర్త్ చేయబడని మోటార్లు . స్టార్టర్లు , GI పైపులు మరియు ఫుట్ వాల్లు తాకడం అత్యంత ప్రమాదకరం ..
  • డిస్ట్రిబ్యూషన్ ట్రాంఫార్మర్ వద్ద అనధికారంగా ఫ్యూజులు మార్చడం , రిపేరుచేయడం , ఎబి స్విచ్లు ఆపరేట్ చేయడం మరియు కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం .
  • ఫేజ్ కన్వర్టర్ వాడుట నిషేధము మరియు శిక్షార్హులు . మోటారు మరియు పంపు సెట్లకు ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే స్వంతంగా సరిచేద్దామని ప్రయత్నిస్తే ప్రాణనష్టం / హాని జరగవచ్చు. మోటారు రిపేరు తెలిసిన వారిచేతనే రిపేర్లు చేయించండి .
  • వ్యవసాయ నిమిత్తము మరియు గృహాలలో, అతుకులు లేని సర్వీసు వైరును మాత్రమే ఉపయోగించండి .
  • దండెము వైర్లను మరియు విద్యుత్ వైర్లను కలుపరాదు , సపోర్ట్ వైర్లుగా ఇన్సులేటెడ్ జి.ఐ వైర్లను ఉపయోగించండి . ఇంటి వైరింగ్ కు సరైన ఎర్తింగ్ చేయండి, మరియు నాణ్యమైన ప్లగ్గులు, సెల్ఫోన్ఛార్లర్లనే ఉపయోగించండి .
  • వర్షాలు కురిసినప్పుడు తడిసిన విద్యుత్ స్తంభాల స్టేవైరు / సపోర్టు వైరును మరియు తడిచిన విద్యుత్ ఉపకరణాలను తాకరాదు .
  • తెగిపడిన , వేలాడుతున్న , వదలుగా మరియు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదు, మరియు వెంటనే సంబందిత విద్యుత్ సిబ్బందికి తెలియచేయగలరు .
  • ఎవరికైనా పొరపాటున కరెంట్ షాక్ సంభవిస్తే దగ్గరలోని వ్యక్తులు షాక్ కు గురైన వ్యక్తిని రక్షించాలన్న ఆతృతతో, ప్రమాదం సంభవించిన వ్యక్తిని ముట్టుకోరాదు . షాక్ కు గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని (కర్ర , ప్లాస్టిక్ లాంటి) వస్తువులను వాడడమే సరియైన పరిష్కారం .
  • గ్రామీణ వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్ర స్థాయి విద్యుత్ సిబ్బందికి లైన్ మెన్ , లైన్ ఇన్స్పెక్టర్ , సీనియర్ లైన్ ఇనస్పెక్టర్ మరియు సబ్ ఇంజనీర్ , సెక్షన్ ఆఫీసర్ గార్లను సంప్రదించి వారి సేవలను పొందండి .
Advertisement

విద్యుత్ సంబంధిత సమస్యలకు & ఫిర్యాదులు తెలియజేయడానికి టోల్ ఫ్రీ నెంబరు .1800 425 0028 కు లేదా 1912 కు ఫోన్ చేయగలరని మనవి .