ప్రజలతో కలసి బతుకమ్మ ఆడిన IPS అధికారిని చందన దీప్తి గారు

పల్లెలన్నీ ఒళ్ళు విరుచుకొని ప్రజ్వలించే పండుగ.

ఆడబిడ్డల ఆనందాలు అంబరాన్నెంటే పండుగ.

ఇంట్లో ఉన్న ఆభరణాలన్ని ఒంటిమీదకొచ్చే పండుగ.

పట్టుచీరలన్నీ పక్కున ప్రకాశించే పండుగ.

ముసలోళ్ల మూసి మూసి నవ్వుల పండుగ.

అరుగు మీద అవ్వ ఆనందంగా ఉండే పండుగ.

మగువల సొగసు ఆటను చూసి మబ్బులు సిగ్గుపడే పండుగ.

ముద్దుగుమ్మలు మురిసిపోయే ముచ్చట్ల పండుగ…

పడుసు పోరగాండ్ల పరాక్రమ ప్రదర్శనల పండుగ…

పడచుల నయనాలు నాట్యమాడే పండుగ…

కన్నె పెదాల ఎరుపుకు ఆకాశంలోని చుక్కలు కూడా చీకట్లకెళ్లే పండుగ…

కోలాటాల కౌగిలింతల పండగ…

ఇది తెలంగాణ పూల పండుగ…..!!