కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు హిజ్రాలకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని హిజ్రాల సంఘం నాయకురాలు లైలా అన్నారు . వరంగల్ SRR తోటలో మహిళా సంఘాల (12) గ్రూపుల్లో సభ్యులు గా ఏర్పాటైన హిజ్రాలతో , శుక్రవారం ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్ అర్బన్ లవ్-లిహూడ్ (NULM ) సీనియర్ మేనేజర్ జెడ్జెస్ రావు భేటీ అయ్యారు . ముందుగా మెప్మా సీవో హిజ్రాలు , మహిళా గ్రూపుల్లో సభ్యులుగా ఏర్పాటైన విధానంపై వివరించారు .
వరంగల్ అండర్ రైల్వేగేట్ ప్రాంతంలో హిజ్రాలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని RP అనిత తనదృష్టికి తీసుకువచ్చిందని అన్నారు . మెప్మా ఉన్నతాధికారులు బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి వారిని సభ్యులుగా చేర్చుకోవాలని ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు, దీంతో హిజ్రాలు ముందుకురాగా మహిళా సంఘాల్లో సభ్యులుగా తీసుకోవడానికి అవకాశం లభించిందని తెలిపారు . ఇప్పటి వరకు 12 గ్రూపుల్లో ఒక్కొక్క గ్రూపులో ఆరుగురు చొప్పున హిజ్రాలకు సంఘ సభ్యత్వం ఇచ్చినట్లు చెప్పారు .
ఈ సందర్భంగా హిజ్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు , కావలసిన అవసరాల పై సంఘ నాయకురాలు లైలాతో పాటు హిజ్రాలు గోడును వెలిబుచ్చారు . తాము అందరి లాగే సమాజంలో మంచిగా బతుకుదామని కోరుకుంటున్నా వివక్షతకు గురవుతూనే ఉన్నామన్నారు . మాలో కూడా ఉన్నత చదువు చదివిన వారు ఉన్నా ఎవరూ ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం లేదన్నారు . విధిలేని పరిస్థితుల్లో భిక్షాటన చేయాల్సి వస్తుందని తెలిపారు .. ప్రజలు రూ . 10తో ఆటో ఎక్కితే మేము రూ . 50 , రూ . 100లకు డైరెక్టుగా మాట్లాడుకుని పయనించవలసి వస్తుందని లైలా ఆవేదన వ్యక్తంచేశారు . ఇక కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించి ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుకున్నా కనికరం చూపెట్టడం లేదన్నారు . ప్రభుత్వాలు ఆదరిస్తే భిక్షాటనను తక్షణం మానేస్తామని తెలిపారు …