ప్రజలకు భద్రతపై బరోసా కల్పించడంకోసం కార్డన్ సర్చ్ నిర్వహించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమీషనర్ డా.వి.రవీందర్ తెలిపారు. శాంతి భద్రతల నియంత్రణలో భాగంగా వరంగల్ డివిజన్ అధ్వర్యంలో మీల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో శివనగర్ ప్రాంతంలో శనివారం కార్డన్ సర్చ్ నిర్వహించబడింది. ఈ కార్డన్ సర్చ్‌లో భాగంగా శివనగర్ ప్రాంతంలోని అనుమానిత ఇండ్ల తనీఖీ చేయడంతో పాటు, ఈ ప్రాంతంలో నివసించే రౌడీ షీటర్లతో పాటు గతంలో నేరాలకు పాల్పడిన నేరస్థుల ఇండ్ల పోలీసుల తనీఖీ చేయడంతో పాటు, వారి ప్రస్తుత స్థితిగతుల అడిగి తేలుసుకోవడంతో పాటు, ప్రస్తుత జీవన విధానంపై పోలీసులు ఆరా తీయడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ రౌడీ షీటర్ ఇంటిని సందర్శించి వివరాలను సేకరించారు. ఎలాంటి పత్రాలు లేని 14 ద్వీచక్రవాహనాలను పోలీసులు సీజ్ చేయడం జరిగింది.
అనంతరం పోలీస్ కమీషనర్ ఈ ప్రాంత ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్బంగా పోలీసుల పనీతీరుపై కమీషనర్ స్థానిక ప్రజలను అడిగి తేలుసుకోవడంతో పాటు, శాంతి భద్రతలకు సంబంధించి స్థానిక సమస్యలను పోలీస్ కమిషనర్ ఆరా తీసారు. అనంతరం పోలీస్ కమీషనర్ మట్లాడుతూ నేరాల నియంత్రించడంతో పాటు, నేరస్థులను గుర్తించడం కోసం ఈ కార్డన్ సర్చ్ నిర్వహించడం జరుగుతుందని. ముఖ్యంగా ప్రజల భద్రత కోసం కాలనీలో బ్లూకోల్ట్స్ సిబ్బందితో పాటు నూతనంగా ఎర్పాటు చేసిన పెట్రో కార్ ద్వారా ముమ్మరం పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు, గతంలో నేరాలకు పాల్పడిన నేరస్థులపై నిఘా కోనసాగించడం జరుగుతుందని. ముఖ్యంగా నేరాల నియంత్రణకు ప్రజలు స్వచ్చందగా ముందుకు వచ్చి సి.సి కెమెరా ఏర్పాటు ముందురావల్సిన అవసరం వుందని.
తద్వారా నేరాలను తగ్గించడంతో పాటు, నేరాలకు పాల్పడిన నిందితులను గుర్తించడంలో సులభతరం అవుతుందని, అధే పనిగా నేరాలకు పాల్పడిన నేరస్టులు మారో నేరాలకు పాల్పడకుండా వుందేందుకు గాను వారిపై పీడీ యాక్ట్ క్రింద కేసులను నమోదు చేయబడుతోందని ఇలా ఇప్పటి వరకు57 మంది నేరస్టులపై పీడీ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేయబడ్డాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.