ప్రజల భద్రత కోసమే కార్దన్ సర్చ్ లు నిర్వహించబడుతున్నాయి :

వరంగల్ పోలీస్ కమిషనర్ డా.వి.రవీందర్

కాలనీల్లో నేరాలను నియంత్రించడంతో పాటు, నేరస్తులను గుర్తించేందుకుగాను కాలనీవాసులు తమ భాగస్వాయ్యంతో సి.సి కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ డివిజనల్‌ పోలీసుల అధ్వర్యంలో మంగళవారం ఇంతేజార్ గంజ్ పరిధిలోని సుందరయ్య నగర్, ఎనమాముల ప్రాంతాల్లో కార్డన్‌సర్చ్‌ నిర్వహించారు. సుమారు 150పైగా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గోన్న ఈ కార్డన్‌ సర్చ్‌లో పోలీసులు ఈ ప్రాంతంలో నివాసం వుంటున్న రౌడీ షీటర్లు, గతంలో నేరాలకు పాల్పడిన పాత నేరస్తులతో పాటు ఆనుమానితులను అదుపులోకి తీసుకోని ప్రశ్నించారు.

ఈ తనీఖీల్లో ఎలాంటి ఆనుమతి పత్రాలు లేని 30ద్వీచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది .