జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు మాట్లాడుతూ: ఈ మధ్యన గ్రామాల్లో కి గుర్తు తెలియని వ్యక్తులు మధ్యాహ్నం పూట ప్రజలందరూ పనులకు పోయిన సమయంలో లో గుర్తుతెలియని వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చి గ్యాస్ పొయ్యి రిపేరు చేస్తాం, దుప్పట్లు, రగ్గులు అమ్మడానికి వచ్చినాగాని బీరువ తాలాలు, ఇంటి తాలాలు రిపేర్ చేస్తాం అని వచ్చినగాని అదేవిధంగా గా వృద్ధులకు కు వృద్ధాప్య పెన్షన్స్ ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి గ్రామంలోని తాళాలు వేసి ఉన్న ఇళ్ళ యొక్క సమాచారం సేకరించి రాత్రిపూట దొంగతనాలు చేసినట్లు సమాచారం వున్నందున, ప్రజలందరికీ మా యొక్క విన్నపం ఏమనగా ఎవరైనా అపరిచిత వ్యక్తులు గ్రామాల్లోకి గ్రామాల్లోకి వచ్చినట్లయితే మీరు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ గాని డయల్ 100 నెంబర్ గాని ఫోన్ చేసి ఈ సమాచారం ఇవ్వగలరు.

ఎవరైనా వ్యక్తులు బంగారాన్ని మెరుగుపరుస్తాము అని, తక్కువ ధరకే బంగారం ఇస్తామని, మాకు అత్యవసర ప్రస్తితినున్నందున ఈ బంగారాన్ని అమ్మవలిసివస్తుందని అలాంటి వారి మాటలు నమ్మి నకిలీ బంగారం కానీ, నకిలీ నగలను కానీ కొని మోసపోవద్దని, అలాగే మీ ఇంటికి వాస్తు దోషాలు ఉన్నాయి వాటిని వివరిస్తాం అని గాని మన గ్రామంలోకి ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వారిని నమ్మకుండా అనుమానిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వగలరు అదేవిధంగా మీకు సంబంధించిన బ్యాంకు ఖాతా వివరాలు మరియు ATM కార్డు పిన్ నెంబరు మరియు,

ATM CVV నెంబర్ అదేవిధంగా OTP నెంబర్స్ ఎట్టి పరిస్థితిలో ఎవరు ఫోన్ చేసి అడిగిన చెప్పకూడదు మీరు ఇచ్చినటువంటి సమాచారాన్ని ఆసరాగా చేసుకుని బ్యాంకు ఖాతా లో ఉన్నటువంటి డబ్బులని చాలా సులభంగా సైబర్ నేరస్తులు దోచుకుంటున్నారు కాబట్టి ఎక్కడ నుంచి ఫోన్ చేసి మీయొక్క బ్యాంకు సమాచారం అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు ముఖ్యంగా గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వచ్చి సంచరిస్తున్నప్పుడు ఏమాత్రం అనుమానం కలిగిన స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వగలరని, పోలీసులు ఎల్లపుడూ ప్రజల రక్షణ కొరకే పని చేస్తారని, ప్రజలు పరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వుండాలని ఈ సంధార్బంగా జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు అన్నారు.