ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా SP.కుమారి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు ఫ్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్రజావాణిలో బాగంగా ఫిర్యాదుదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాది దారులకు చట్టపరమైన విషయంలో న్యాయం జరగకపోతే ఫిర్యాదిదారులు తిరిగి తనను సంప్రదించవలసిందిగా కోరినారు.
ఈ ప్రజవాణిలో భాగంగా తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన తున్కి సత్యం తమకు తమ పాలివారికి కల భూమి తగాదాల విషయంలో తేది:17-04-2019 నాడు ఉదయం 8 గంటల సమయంలో తమ పాలివారైన 1} తున్కి అశోక్ తండ్రి: పోచయ్య, 2} తున్కి రమేష్ తండ్రి: పోచయ్య, 3} తున్కి పోచయ్య తండ్రి: మల్లయ్య అను వారితో తమ యొక్క భూమి సమస్య విషయమై నలుగురు పెద్దల సమక్షంలో మాట్లాడిన తర్వాత తున్కి అశోక్ తండ్రి: పోచయ్య అను వ్యక్తి నన్ను ఎలాగైనా చంపెస్తానని పెద్దల ముందు అని, నేను ఇంటికి రాగానే నా ఇంటి వద్ద నేను నిలబడి ఉండగా తున్కి అశోక్ అకస్మాత్తుగా ఒక కళ్ళు సీసా పగలగొట్టి నాపైన దాడి చేసి అట్టి సీసాతో కడుపులో పోడిచినాడని, నేను స్పృహ తప్పి పడిపోతే తన కుటుంబ సబ్యులు తూప్రాన్ ప్రభుత్వ దవఖనాకు తీసుకెల్లగా అక్కడ వారు నన్ను గాంది దవఖనాకు హైదరాబాద్ తీసుకువెళ్ళమని చెప్పారని,నన్ను గాంది దవఖనా హైదరాబాద్లో అడ్మిట్ చేసుకుని నా గాయం కొంత తగ్గిన తర్వాత డిశ్చార్జ్ చేసినారని,ప్రస్తుతం తను ప్రైవేట్ దవఖనాలో చికిస్థ పొందుతున్నాడని,ఇంకా నాపై నా కుటుంబపై పైన తెలిపిన వ్యక్తులు కక్ష కట్టి ఏవిదంగానైన చంపేస్తారని కావున పైన తెలిపిన వారిపైన చట్ట పరమైన చర్య తీసుకుని తమకు న్యాయం చేయగలరు అని జిల్లా ఎస్.పి. గారికి ఫిర్యాదు చేయగా ఎస్.పి. గారు స్పందిస్తూ ఫిర్యాదుదారుడికి న్యాయం జరిగేటట్లు చట్టం ప్రకారం తగు చర్యలు చేపట్టాలని, సి.ఐ. తూప్రాన్ గారిని ఆదేశించినారు.
అలాగే నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామానికి చెందిన తొంట మంజుల తేది:27-04-2019 నాడు తమ ఇంట్లో నిద్రిస్తుండగా అందాద 01:20 నిమిషాలకు కొండి కిరణ్ అనే వ్యక్తి మా ఇంటి కిటికీ జాలి కట్ చేసి కిటికిలో నుండి దూకి ఇంటి లోకి వచ్చి మా బీరువా పగులగొట్టి అందులో నుండి 7000 రూపాయల తీసుకుని మరియు నా చెయ్యి పట్టి లాగి నన్ను బలాత్కారం చేయబోయాడని నేను గట్టిగా అరిస్తే,మా లేచిందని నేను మా అమ్మ అతడిని పట్టుకోబోయామని అతడు తమను తోసేసి పారిపోయాడని, అతని వళ్ళ తమకు ప్రాణభయం ఉన్నదని కావున పైన తెలిపిన వ్యక్తి పైన చట్ట పరమైన చర్య తీసుకుని తమకు న్యాయం చేయగలరు అని జిల్లా ఎస్.పి. గారికి ఫిర్యాదు చేయగా ఎస్.పి. గారు స్పందిస్తూ ఫిర్యాదురాలికి న్యాయం జరిగేటట్లు చట్టం ప్రకారం తగు చర్యలు చేపట్టాలని, డి.ఎస్.పి. తూప్రాన్ గారిని ఆదేశించినారు.
అలాగే శంకరంపేట మండలం గజగట్లపల్లి గ్రామానికి చెందిన రెడ్డి యాదమ్మ తన బిడ్డ ప్రియాంక తమ సంసార విషయంలో మాములుగా గొడవపడగా తమ పాలివారైన 1}రెడ్డి యశోద భర్త :సత్యనారాయణ,రెడ్డి 2} దుర్గమ్మ భర్త:బాలే,3} ముత్తగార్ సుగుణ భర్త: శిలారి,4} రెడ్డి చిన్న లక్ష్మి భర్త: నర్సింలు,5}రెడ్డి భారతమ్మ భర్త: ముత్యాలు,6} ముత్తగార్ శిలారి తండ్రి: బాలయ్య, వీరందరు కలసి తనను ఇంట్లో నుండి గుంజుకోనిపోయి పంచాయతి కార్యాలయంలో వేసి కట్టెలతో కొట్టి కాళ్ళతో తన్నినారని వీరి వల్ల తనకు ప్రాణభయం ఉన్నదని కావున పైన తెలిపిన వారిపైన చట్ట పరమైన చర్య తీసుకుని తమకు న్యాయం చేయగలరు అని జిల్లా ఎస్.పి. గారికి ఫిర్యాదు చేయగా ఎస్.పి. గారు స్పందిస్తూ ఫిర్యాదురాలికి న్యాయం జరిగేటట్లు చట్టం ప్రకారం తగు చర్యలు చేపట్టాలని ఆదేశించినారు