జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయంలో పోలీస్ ఉన్నత అధికారి ఎస్.పి. కుమారి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు జిల్లా పోలీసు సిబ్బందికి ముఖ్యంగా బ్లూ కోట్స్, పెట్రోలింగ్ వాహన డ్రైవర్ల యొక్క వాహానాలను తనిఖి చేయడం జరిగింది. ఇందులో భాగంగా.. ఎస్.పి. గారు మాట్లాడుతూ.. అత్యవసర సమయాలలో పోలీస్ డ్రైవర్లు చూపే చొరవ అత్యంత కీలకమైనదని, వారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం వల్ల సంఘటన స్థలానికి త్వరిత గతిన చేరుకోవచ్చు తెలిపినారు, అదేవిధంగా మానవ జీవితంలో సాంకేతిక పరిజ్ఞానం అనేక మార్పులు తీసుకోనివచ్చిందని, ఈ పరిజ్ఞాన్నాని మంచికోసం ఉపయోగించుకోవాలని తెలిపినారు. ముఖ్యంగా సిబ్బందికి డయల్ 100 కాల్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన ముఖ్యమైన 5 అంశాలు..

డయల్ 100 కాల్ అటెండ్ కావడం , వినడం , ప్రశ్నించడం , సమస్యల పట్ల సహానుభూతి చూపడం , ప్రజల పట్ల సేవాభావం – వీటి పై అవగాహన కలుగజేశారు. అదేవిధంగా ప్రజలు బాధలో ఉన్నపుడే డయల్ 100 కాల్ చేయడంగాని, పోలీస్ స్టేషన్ కు రావడం జరుగుతుందని, అలాంటి సమయంలో వారియొక్క భాదను తమ బాధల భావించి వారికి వినమ్రతతో, వినయంతో సమాధానం ఇస్తూ వారియొక్క బాధను పరిష్కరించాలని అన్నారు. అలాగే ప్రజల నుండి పోలీస్ సిబ్బంది గౌరవం, మన్ననలు సంపాదించుకోవాలని, అలా చేయడం వల్ల చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని, అలాగే పోలీస్ సిబ్బంది సమాజంలో ఉండే వారికి ఆదర్శప్రాయంగా ఉండాలన్నారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది ప్రజలతో మెలిగేటప్పుడు బాడీ లాంగ్వేజ్ బాగుండాలని, “మేము మీకోసమే ఉన్నాము అనే భావన, భరోసా” ప్రజల్లో కల్గించాలని అన్నారు..