ప్రజా సంక్షేమ, రైతు భరోసా మ్యానిఫేస్టో , జై తెలంగాణ !! జై కెసిఆర్

రాష్ట్ర ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మ్యానిఫేస్టో ప్రకటించిన సందర్బంగా పెన్షన్ల పెంపు, రైతులకు అండగా తీసుకున్న నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాజిపేట్ చౌరస్తా లో రాష్ట్ర నాయకులు నార్లగిరి రమేష్ , వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కలిసి కేసీఆర్ చిత్ర పటానికి క్షిరాభిషేకం చేసారు.

ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ రైతు రాజ్య స్థాపన కోసం , రైతును రాజును చేయాలనే గొప్ప సంకల్పంతో రైతుల కోసం మ్యానిఫేస్టోలో మంచి కార్యక్రమాలను ప్రకటించారని, పెన్షన్లు పెంపు నిర్ణయం మ్యానిఫేస్టోలో చేర్చడం ద్వారా పేదలకు, వికలాంగులకు ఒక భరోసా లబించిందని ఇది సంక్షేమ మ్యానిఫేస్టో అని అన్నారు. రానున్నది కేసీఆర్ గారి ప్రభుత్వమే అని ఎన్ని కూటములు వచ్చినా కేసీఆర్ నాయకత్వం ముందు నిలవలేవని తెరాసా 100సీట్లు సాదిస్తుందని తెలిపారు..