మిర్యాలగూడ హతుడు ప్రణయ్ భార్య అమృత పండంటి మగబిడ్డకు జన్మ నిచ్చింది. ప్రస్తుతం.. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రణయ్ హత్య జరిగిన నాటినుంచి పోలీసుల రక్షణలో అమృత, కుటుంబసభ్యులు ఉన్నారు. మరోవైపు అమృత తండ్రి, ప్రధాన నిందితుడు మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్ వరంగల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

ప్రణయే మళ్లీ పుట్టాడని, బిడ్డను కోల్పోయిన తమకు ఈ పిల్లాడి రాకతో కొండంత ఆశ, ధైర్యం వచ్చాయని పేర్కొన్నారు. వైశ్యకులానికి చెందిన అమృత, దళితుడైన ప్రయణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆమె తండ్రి మారుతీరావు కిరాయి హంతకులతో చంపించడం తెలిసిందే. హత్య జరిగినప్పటి నుంచి అమృత అత్తింట్లోనే ఉంటోంది. వారి ఇంటికి ప్రభుత్వం పోలీసు భద్రత కల్పించింది.

ఈ రోజే ప్రణయ్-అమృతల పెళ్లి రోజు కూడా అవ్వడం విశేషం. సరిగ్గా మ్యారేజ్ రోజునే మగ బిడ్డ పుట్టడంతో.. చనిపోయిన ప్రణయ్ తన బిడ్డ రూపంలో వచ్చాడంటూ అమృత ఆనందం వ్యక్తం చేస్తోంది.